: కేసీఆర్ వ్యాఖ్యలతో హైదరాబాదులో సీమాంధ్రులకు భయం పెరిగింది: పళ్లంరాజు
కేసీఆర్ వ్యాఖ్యల తర్వాతే హైదరాబాదులోని సీమాంధ్ర ప్రజలకు అభద్రతా భావం పెరిగిందని కేంద్రమంత్రి పళ్లంరాజు అన్నారు. అందుకే ప్రజల్లో భయం పెరిగిందని చెప్పారు. కాగా, సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాతే సీమాంధ్రలో ఆందోళనలు మొదలయ్యాయన్నారు. తెలంగాణ ఏర్పడగానే హైదరాబాదులో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులు తరలిపోవాలంటూ కొన్నిరోజుల కిందట కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.