: యూపీలో సస్పెండైన ఐఏఎస్ ఆఫీసర్ ను ఆహ్వానించిన పంజాబ్


ఉత్తరప్రదేశ్ ఇసుక మాఫియా వ్యవహారంలో సస్పెండయిన ఐఏఎస్ అధికారిణి దుర్గాశక్తి నాగపాల్ ను తిరిగి తన క్యాడర్ కు రావాలంటూ పంజాబ్ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఆమెను ఆహ్వానించారు. ఇంతకుముందు పంజాబ్ లో పని చేసిన ఆమె వివాహం అనంతరం యూపీలో ఐఏఎస్ అధికారిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదిలావుంటే, ఆమెకు యూపీ వక్ఫ్ బోర్డు మద్దతుగా నిలిచింది. మసీదు గోడను ఇసుక మాఫియానే కూల్చి ఆమెను అన్యాయంగా వివాదంలోకి లాగిందని బోర్డు పేర్కొంది.

  • Loading...

More Telugu News