: ఫేస్ బుక్ ను తలదన్నిన గూగుల్ మ్యాప్స్


ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ గా గూగుల్ మ్యాప్స్ నిలిచింది. 54 శాతం మంది స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్ ను వాడుతున్నారు. గ్లోబల్ వెబ్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా 96.9కోట్ల మంది వినియోగిస్తున్న టాప్ 10 యాక్టివ్ అప్లికేషన్ల వివరాలను వెల్లడించింది. ఫేస్ బుక్ అప్లికేషన్ రెండో స్థానంలో నిలిచింది. దీనిని 44 శాతం స్మార్ట్ యూజర్లు వాడుతున్నారు.

ఇక మూడో స్థానంలో గూగుల్ కే చెందిన యూట్యూబ్ ఉంది. దీనిని 35 శాతం మంది వినియోగిస్తున్నారు. నాలుగో స్థానంలో 30 శాతం మంది యూజర్లతో గూగుల్+ నిలిచింది. 5వ స్థానంలో వియ్ చాట్ , ట్విట్టర్ మొబైల్ అప్లికేషన్ ఆరవ స్థానంలో ఉంది. దీనిని 22 శాతం మంది వినియోగిస్తున్నారు. తర్వాత స్కైప్, ఫేస్ బుక్ మెస్సెంజర్ ఉన్నాయి. 17 శాతం మంది యూజర్లతో వాట్స్ యాప్ 9 వ స్థానంలో, ఫేస్ బుక్ కు చెందిన పిక్చర్ అప్లికేషన్ ఇన్ స్టా గ్రామ్ 10 వ స్థానంలో నిలిచింది.

  • Loading...

More Telugu News