: కేరళ వ్యాప్తంగా పెద్ద ఎత్తున 'బలితర్పణం'
'కర్కిడక వావు' దినాన్ని పురస్కరించుకుని కేరళీయులు పెద్ద సంఖ్యలో కాలం చేసిన తమ పెద్దలకు తర్పణాలను అర్పించారు. నదులు, సముద్ర తీరాలు, ఆలయాల వద్దకు వేల సంఖ్యలో చేరుకుని బలితర్పణంలో పాల్గొన్నారు. గతించిన తమ పెద్దల పేరిట పిండ ప్రదానం చేశారు. పెరియార్ నదీ తీరంలో అధికారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక పందిళ్ల కిందే ప్రజలు ఈ క్రతువులో పాల్గొన్నారు. అలాగే, షణ్ముగం బీచ్, తిరువలూమ్ పరశురామ ఆలయం, వర్కల పాపనాశనం బీచ్ తదితర ప్రాంతాలలో ట్రావెన్ కోర్ దేవస్థానం ఏర్పాట్లు చేసింది.
ఈ రోజున తమ పెద్దలకు తర్పణం అర్పిస్తే.. వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని కేరళీయుల నమ్మకం. కర్కిడక అనేది మలయాళ పంచాంగంలో చివరి మాసం. వావు అంటే అమావాస్య రోజు. ఏటా ఇదే రోజున బలితర్పణం జరుగుతుంది.