: మోడీ పేరు ప్రకటించేందుకు బీజేపీ సిద్ధం?
2014 ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడీ పేరును త్వరలో ప్రకటించేందుకు సిద్ధమైంది. ఈ నెల 15న మోడీ పేరును ప్రకటించాలని నిర్ణయించినట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ముందు 11వ తేదీనే ప్రకటించాలనుకున్నా పరిస్థితుల కారణంగా షెడ్యూల్ ను మార్చుకున్నట్లు చెప్పారు. మూడు రోజుల కిందట సమావేశమైన ఆర్ఎస్ఎస్, బీజేపీ.. ప్రధాని అభ్యర్ధిగా మోడీ పేరును ఎంపికచేశాయి. మోడీ పేరును వెంటనే ప్రకటించాలని ఆర్ఎస్ఎస్.. బీజేపీకి సూచించిన సంగతి తెలిసిందే.