: కిరణ్ తో గంటా, శైలజానాథ్ భేటీ


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తో మంత్రులు గంటా శ్రీనివాసరావు, సాకే శైలజానాథ్ భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం. కాగా విభజనపై కాంగ్రెస్ నేతల పరిస్థితి 'ముందు నుయ్యి, వెనుక గొయ్యి' లా మారింది. అటు అమ్మ మాట జవదాటలేరు.. ఇటు ప్రజల్లోకి వెళ్లలేరు. రాష్ట్రంలో ఎన్ని గిమ్మిక్కులు చేసినా పార్లమెంటులో ఎంపీల తీరు కాంగ్రెస్ నేతల వ్యవహారశైలిని బయటపెడుతోంది. టీడీపీ నేతలు తమ చిత్తశుద్ధి నిరూపించుకుంటున్నా కాంగ్రెస్ ఎంపీలు కలిసి రాకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. దీంతో పార్టీలో, ప్రజల్లో వీరికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.

  • Loading...

More Telugu News