: సరిహద్దుల్లో భద్రతలేమి ప్రభుత్వ నిర్లక్ష్యమే: మోడీ


భారత సరిహద్దుల్లో చైనా చొరబడినా, పాకిస్తాన్ దాడిచేసి జవాన్ల ప్రాణాలు తీస్తున్నా కేంద్ర ప్రభుత్వం భద్రత విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఈ ఘటనలపై ప్రభుత్వం ఎప్పుడు మేల్కొంటుందని ఆయన ప్రశ్నించారు. జమ్మూకాశ్మీర్, పూంచ్ సెక్టార్లోని చకందాబాద్ వద్ద భారత బలగాలపై పాక్ సైన్యం గతరాత్రి జరిపిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి చెందడం అంగీకరించదగినది కాదన్నారు. ధైర్యవంతులైన సైనికులను కోల్పోయిన కుటుంబాలకు మోడీ తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేశారు.

  • Loading...

More Telugu News