: ఆగిన మరో సమైక్యాంధ్ర గుండె
రాష్ట్ర విభజనను ఆ గుండె తట్టుకోలేకపోయింది. సమైక్యాంధ్ర కోసం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఉద్యమాన్ని చూసి చలించిపోయింది. టీవీలో వార్తలు చూస్తూనే చివరికి ఆ గుండె ఆగిపోయింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం, ఎర్రనీలిగుంట గ్రామానికి చెందిన బొక్కా సుంకరుడు(40) టీవీ చూస్తేనే తుదిశ్వాస విడిచాడు. రాష్ట్ర విభజనను తట్టుకోలేకే గుండెపోటుతో అతడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.