: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి: సోనియాకు కిరణ్ లేఖ
రాష్ట్ర విభజనపై ప్రకటన చేసి రోడ్ మ్యాప్ పై కేంద్రం దృష్టి పెట్టిన సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ఎలాగైనా రాష్ట్ర విభజనను ఆపేందుకు ఇలా తనదైన ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కిరణ్ లేఖలో విజ్ఞప్తి చేశారు. దీనిపై పీసీసీ చీఫ్ బొత్సతో పాటు ఆంధ్ర, రాయలసీమ ముఖ్యనేతలు సంతకం చేశారు.
సీమాంధ్రుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇద్దరు సభ్యులతో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇచ్చేదాకా, తెలంగాణ ప్రక్రియను ప్రారంభించవద్దని కోరారు. అటు ఇప్పటికే పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీలు సమైక్య రాగాన్ని హై పిచ్ లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.