: మొదలైన నాగాలాండ్, మేఘాలయ పోలింగ్


ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం మొదలైంది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో ఎలాంటి దుశ్చర్యలు జరగకుండా పోలీసులు భారీ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 60 స్థానాలకు పోలింగ్ జరుగుతున్న నాగాలాండ్ లో ఇద్దరు మహిళలు సహా 188 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. వీరిలో 39 మంది స్వతంత్ర అభ్యర్ధులు వున్నారు.

ఈ 
రాష్ట్రంలో నాగా పీపుల్స్ ఫ్రంట్ 60 స్థానాలకు, కాంగ్రెస్ 57, ఎన్ సీపీ 15, బీజేపీ 11, జేడీయూ 3, ఆర్జేడీ 2, యునైటెడ్ నాగాలాండ్ డెమోక్రటిక్ ఒక స్థానంలో పోటీపడుతున్నాయి. మొత్తం 11 లక్షల 93వేల మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

ఇక మేఘాలయ విషయానికి వస్తే .. 60 అసెంబ్లీ స్థానాలకు
 345 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కాంగ్రెస్ అన్ని స్థానాల్లోనూ బరిలోకి దిగగా,  పీఏ సంగ్నాకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ 32, ఎన్సీపీ 21, బీజేపీ 13 చోట్ల తమ అభ్యర్ధులను రంగంలోకి దింపాయి.

  • Loading...

More Telugu News