: బరితెగించిన పాక్ సైన్యం.. ఐదుగురు భారత జవాన్ల మృతి
మళ్లీ పాక్ సైన్యం చెలరేగిపోయింది. జమ్మూకాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో, చకందాబాద్ వద్ద భారత పోస్ట్ పై విచ్చలవిడిగా కాల్పులకు దిగింది. ఈ దాడిలో ఐదుగురు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు గాయపడ్డారని సమాచారం. ఇటీవల సరిహద్దుల్లో పాక్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ తరచూ కాల్పులకు దిగుతున్న సంగతి తెలిసిందే.