: మెదడులో దిక్సూచి ఉంటుందట!


మనకు తెలియని కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు మనం ఏ దిక్కున ఉన్నాం... ఎలా వెళుతున్నాం? అనే విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువగా దిక్సూచిని వాడుతుంటాం. అయితే మామూలు దిక్సూచికన్నా మన మెదడులోనే నిజమైన దిక్సూచి ఉంటుందని, అది మనం ఏ దిక్కున వెళుతున్నాం? అనే విషయంలో మనకు దిశా నిర్దేశనం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పెన్సిల్వేనియా, కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెల్స్‌, థామస్‌ జెఫర్సన్‌ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా జరిపిన పరిశోధనల్లో మనకు పరిచయం లేని ఒక కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు మనం ఎక్కుడున్నాం? ఎలా వెళుతున్నాం? అనే విషయాలను మన మెదుడులో ఉండే దిక్సూచి నిర్దేశిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు 14 మంది మూర్ఛ రోగులపై అధ్యయనాన్ని నిర్వహించారు. వీరికి చికిత్స అందిస్తున్న వైద్యులు చికిత్సలో భాగంగా అంతకుముందే వారికి మెదడులో కొన్ని ఎలక్ట్రోడులను అమర్చారు. దీంతో మెదడులో జరిగే మార్పులను గుర్తించడం శాస్త్రవేత్తలకు తేలికైంది. మెదడులోని సింగ్యులేట్‌ కార్టెక్స్‌ అనే భాగంలో ఉండే గ్రిడ్‌ కణాలు, మనిషి కదలికలకు మార్గనిర్దేశకత్వాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

  • Loading...

More Telugu News