: అతిమేధావి
వయసు చిన్నదే కానీ... మేథో సామర్ధ్యం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఎంత అంటే ఐన్‌స్టీన్‌కన్నా కూడా ఎక్కువే ఉందట. వయసు మాత్రం పదకొండేళ్లే. కానీ మేధాశక్తి పరీక్షలో మాత్రం తండ్రికన్నా ఎక్కువ మార్కులను తెచ్చుకుంది.
బ్రిటన్‌లోని నార్త్ ఆంప్టన్‌కు చెందిన డీన్ మేధో సామర్ధ్య పరీక్ష రాశాడు. తనతోబాటు తన పదకొండేళ్ల కుమార్తె చేత కూడా పరీక్ష రాయించాడు. డీన్ చక్కటి ప్రతిభావంతుడు. ఈ పరీక్షలో డీన్‌కు 142 మార్కులు వచ్చాయి. ఆరో తరగతి చదువుతున్న డీన్ కుమార్తె సెరీస్ కుక్సామీ పార్నెల్‌కు ఏకంగా ఈ పరీక్షలో 162 మార్కులు వచ్చాయి. దీంతో మెన్సా ఐక్యూ పరీక్ష నిర్వాహకులు పార్నెల్ అపార మేధాశక్తి కలిగివుందని నిర్ధారించారు. పార్నెల్ మార్కుల స్కోరును విశ్లేషించిన మెన్సా నిర్వాహకులు పదకొండేళ్ల పార్నెల్ ఐక్యూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావి ఐన్‌స్టీన్ కంటే కూడా ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు.