: ఆస్తి కోసం తండ్రిని హత్య చేసిన కుమారుడు
ఆస్తి కోసం ఎంత దారుణానికైనా తెగబడుతున్నారు కొందరు ప్రబుద్ధులు. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లమ్మ చెరువు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గత కొంత కాలంగా ఆస్తి కోసం తండ్రి శ్రీరాములు(55) తో గొడవ పడుతున్న అతని కొడుకు రమేష్ ఈ సాయంత్రం అతనిని హత్య చేశాడు. అనంతరం రమేష్ నేరుగా పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు.