: మధ్యాహ్న భోజన పథకంపై మూడేళ్లలో 41 ఫిర్యాదులు: ప్రభుత్వం
గత మూడు సంవత్సరాలలో మధ్యాహ్న భోజన పథకంపై నలభై ఒక్క ఫిర్యాదులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆహారంలో నాణ్యత లేకపోవడం, ప్రమాణాలను పాటించకపోవడంలో విఫలం చెందటం వంటి వాటిపై ఆ ఫిర్యాదులు అందినట్లు చెప్పింది. అంతేకాక, పిల్లలకు నాణ్యతలేని ఆహారాన్ని పెట్టడంలేదంటూ 39 ఫిర్యాదులు తమకు వచ్చినట్లు పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో మావవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి శశిథరూర్ వెల్లడించారు. 41 ఫిర్యాదుల్లో ముప్పైఒక్క వాటిపై చర్యలు తీసుకున్నామన్నారు. 2010, 12లో ఉత్తరప్రదేశ్ నుంచి పదకొండు ఫిర్యాదులు వచ్చినట్లు లిఖిత పూర్వక సమాధానంలో వివరించారు.