: బాంబే హైకోర్టు ఆదేశంపై సుప్రీంలో బీసీసీఐ పిటిషన్
ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఏమీ లేదని తేల్చిన బీసీసీఐ కమిటీని రద్దుచేసి మరో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించిన బాంబే హైకోర్టు ఆదేశంపై బీసీసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఓ పిటిషన్ ను దాఖలు చేసింది. తాము ఇద్దరు వ్యక్తులతో ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీ చట్టబద్దమైనదని పిటిషన్ లో తెలిపింది. బోర్డు నియమాల ప్రకారమే ప్యానల్ ఏర్పడిందని పేర్కొంది. కాబట్టి, బాంబే కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని అందులో పేర్కొంది.