: విభజనపై రాంగోపాల్ వర్మ ట్వీట్


ప్రముఖ సంచలన సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మ సామాజిక సమస్యలు, తన సినిమాలు, తన వ్యవహార శైలిపై ట్విట్టర్లో అయినా, ఇంటర్వ్యూల్లో అయినా కరకుగా స్పందిస్తారు. అలాంటి రాం గోపాల్ వర్మ రాష్ట్ర విభజనపై ఆసక్తికరంగా స్పందించారు. అచ్చ తెలుగు అబ్బాయి రాం గోపాల్ వర్మ విభజన నిర్ణయాన్ని ఎండగడుతూ, ఆంధ్రప్రదేశ్ ను ముక్కలు చేయడానికి 'ఓ ఇటాలియన్, ఓ తమిళుడు, ఓ కన్నడిగ, ఓ బీహారీ, ఓ హిందీ చేతులు కలిపారు' అని ట్వీట్ చేస్తూ 'సాంకేతిక అంశాల జోలికి తాను వెళ్లడం లేద'న్నారు. అయితే 'తెలుగు వారిని విడగొట్టడానికి ఈ ఐదుగురు చేతులు కలపడం బాధగా ఉంద'న్నారు. ఎక్కడో ఉన్న తామంతా తెలుగు వారు కనిపిస్తే ఆప్యాయంగా కలుసుకుని, మాట్లాడుకుని, ప్రేమానురాగాలు పంచుకుంటుంటే కలిసున్న తెలుగువారు విడిపోవడం బాధాకరం అని అన్నారు.

  • Loading...

More Telugu News