: ఇందిర, రాజీవ్ విగ్రహాల ధ్వంసం అమానుషం: బొత్స


సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా సీమాంధ్ర జిల్లాల్లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలు ధ్వంసం చేయడాన్ని పీసీసీ చీఫ్ బొత్స సత్యానారాయణ ఖండించారు. ఇందిర, రాజీవ్ విగ్రహాలను ధ్వంసం చేయడం అమానుషమన్నారు. జిల్లా అధ్యక్షులు పార్టీకి గౌరవం తీసుకొచ్చే విధంగా వ్యవహరించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా అందరి ధ్యేయం ఉండాలని, పార్టీకి హాని చేకూర్చే వారి నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. అయితే, స్థానికంగా మంచిపేరు ఉన్న అభ్యర్ధికే పార్టీలో ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ నేతలకు పార్టీ అండగా ఉంటుందన్నారు.

  • Loading...

More Telugu News