: 'నిర్భయ' కేసులో మళ్లీ వాయిదాపడిన జువనైల్ బోర్డు తీర్పు


'నిర్భయ' కేసులో జువనైల్ జస్టిస్ బోర్డు తీర్పు మళ్లీ వాయిదాపడింది. ఆగస్టు 19న దీనిపై తీర్పు వెలువరించనున్నట్లు జువనైల్ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ గీతాంజలి గోయెల్ వెల్లడించారు. 2012 డిసెంబర్ 16న వైద్య విద్యార్ధినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఆరుగురు నిందితుల్లో పదిహేడు సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు. ఇతని కేసును ప్రత్యేకంగా జువైనల్ జస్టిస్ బోర్డు విచారిస్తోంది. దాంతో, విచారణ పూర్తయ్యాక ఇప్పటికి రెండుసార్లు తీర్పు వాయిదాపడింది.

  • Loading...

More Telugu News