: జర్నలిస్టుల పోరాటం అభినందనీయం: జానారెడ్డి
తెలంగాణ సాధన దిశగా జర్నలిస్టుల పాత్ర అభినందనీయమని మంత్రి జానారెడ్డి అన్నారు. హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో తెలంగాణ జర్నలిస్టుల మీడియా ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేసిన జర్నలిస్టులు అభినందనీయులన్నారు. 12 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిందన్నారు. సీమాంధ్రులు ఆవేశంతో ఉద్యమం చేస్తున్నారని జానారెడ్డి అన్నారు. 60 ఏళ్ల వారి అనుబంధాన్ని అర్ధం చేసుకోవాలని అన్నారు. తెలుగు జాతి ఐక్యతకు భంగం వాటిల్లకుండా, అన్నదమ్ముల్లా చర్చించుకుని విడిపోదామని సూచించారు. అలాగే, రెండు మూడు రోజులు ఆగితే వారి ఆవేశం తగ్గిపోయే అవకాశం ఉందని జానారెడ్డి అభిప్రాయపడ్డారు.