: నేలకూలుతున్న ఇందిరమ్మ విగ్రహాలు
విభజన ప్రకనటతో రాష్ట్రంలో ఇందిరాగాంధీ విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ పంచాయితీ కార్యాలయంలో ఇందిరాగాంధీ విగ్రహాన్ని సమైక్యాంధ్ర ఉద్యమకారులు ద్వంసం చేశారు. కాగా, నెల్లూరు ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ, టీడీపీ కార్యకర్తలే కాంగ్రెస్ నేతల విగ్రహాలను కూల్చుతున్నారని ఆరోపించారు. విగ్రహాల ధ్వంసం ఆపకపోతే తామూ టీడీపీ నేతల విగ్రహాల పనిబట్టాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.