: పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి: మండలి బుద్ధప్రసాద్
రాష్ట్ర విభజనపై రాజకీయ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ హితవు పలికారు. కృష్ణాజిల్లా విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ప్రజల మనోభావాలను రాజకీయ పార్టీలు గౌరవించాలని అన్నారు. విభజన నిర్ణయంతో ప్రతి తెలుగువాడి గుండె మండిపోతోందన్నారు. దీంతో, గతంలో ఏం చెప్పినా ఇప్పుడు పార్టీలు సమైక్యాంధ్రకు మద్దతుగా ఆలోచన మార్చుకోవాలని సూచించారు.