: రాష్ట్ర విభజనపై పార్లమెంటులో ఆందోళనలు
రాష్ట్ర విభజన అంశంపై పార్లమెంటులో పలువురు సభ్యులు ఆందోళనకు దిగారు. తమ ప్రాంత ప్రయోజనాలు కాపాడాలంటూ లోక్ సభలో టీడీపీ ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఎంపీ నిమ్మల కిష్ట్రప్ప, కొనకళ్ల, శివప్రసాద్, మోదుగుల అటు, సమైక్యాంధ్ర కోసం కాంగ్రెస్ ఎంపీలు హర్షకుమార్, ఎస్పీవై రెడ్డి, లగడపాటి, కనుమూరి బాపిరాజు, మాగుంట స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో, 12 గంటల వరకు లోక్ సభను స్పీకర్ మీరాకుమార్ వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే ఆందోళన నెలకొనడంతో 11 గంటల వరకు వాయిదాపడింది.