: ఇక సోలార్ రైళ్లు!


సోలార్ విమానం ఇప్పటికే పలుమార్లు ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలో ఇతర సౌరశక్తి ఆధారిత వాహనాలు కూడా వచ్చేశాయి. సోలార్ విద్యుత్తు ఆధారంగా పనిచేసే పలు గృహోపకరణాలనూ చూస్తున్నాం. అన్నీ అనుకూలిస్తే భవిష్యత్తులో సోలార్ రైళ్లు కూడా రానున్నాయి. రైళ్లలో విద్యుత్, ఎయిర్ కండీషనింగ్ కోసం సోలార్ పవర్ ను వాడుకునే మార్గాలపై రైల్వే శాఖ దృష్టి సారించింది.

మద్రాస్ ఐఐటీతో కలిసి ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సోలార్ ఆధారిత రైల్వే కోచ్ ల తయారీ ప్రాజెక్టును చేపట్టింది. బోగీల్లో అంతర్గత లైటింగ్, ఏసీ కోసం సోలార్ పవర్ ను వినియోగించే మార్గాలను అన్వేషించాల్సిందిగా ఐఐటీ మద్రాస్ ను కోరామని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించి నెల క్రితం ఒప్పందం చేసుకున్నామని, ప్రొఫెసర్లతో ప్రాథమిక చర్చలు కూడా జరిపినట్లు వెల్లడించారు. ఇది విజయవంతం అయితే, అప్పుడు సోలార్ కార్ల తయారీపై కూడా దృష్టి పెడతామన్నారు.

  • Loading...

More Telugu News