: విమానంలో బంగారం తరలిస్తూ ఇద్దరు అరెస్టు


విమానంలో బంగారం తరలిస్తూ ఇద్దరు ప్రయాణికులు పట్టుబడ్డారు. దుబాయ్ నుంచి చెన్నై చేరుకున్న ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో బంగారం తరలిస్తున్నారన్న సమాచారంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. కేరళ రాష్ట్రం కన్నూర్ కు చెందిన కసాబుద్దీన్ అనే వ్యక్తి నుంచి పదమూడు లక్షల విలువ చేసే 400 గ్రాముల నగలు బయటపడ్డాయి. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, ఎయిర్ ఇండియా విమానంలో కేరళలోని త్రిచూర్ కు చెందిన మొహిసాబు నుంచి 20 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News