: మెట్రో ప్రయాణానికి పంచెకట్టు అడ్డు!


ఒకప్పుడు గాంధీగారిని దక్షిణాఫ్రికాలో రైల్లోనుండి దించేశారట... అలాగే ఒక పెద్దాయనను రైల్లోనుండి దించేశారట. అయితే ఆయనేమీ వర్ణవివక్షకు గురైకాదు... కేవలం పంచె కట్టుకున్నాడు కాబట్టి! భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో పంచెకట్టుకు అందునా ధోతీ వస్త్రధారణకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇలా ధోతీ కట్టుకున్న ఒక భారతీయుడిని దుబాయ్‌లోని మెట్రో రైల్లో ప్రయాణించేందుకు వీల్లేదంటూ ఒక అధికారి కిందికి దించేశారు.

గత శనివారం నాడు ఎటిసలాట్‌ మెట్రో స్టేషన్‌కు వెళ్లిన 67 ఏళ్ల ఒక వ్యక్తిని అక్కడి ఒక పోలీసు అధికారి అడ్డుకున్నారట. పంచె కట్టుకుని మెట్రో రైల్లో ప్రయాణించడానికి అనుమతి లేదని సదరు పోలీసు అధికారి చెప్పారని బాధితుడి కుమార్తె మధుమతి పేర్కొన్నట్టు గల్ఫ్‌ న్యూస్‌ వెల్లడించింది. గతంలో కూడా అనేకసార్లు ధోతీని ధరించి మెట్రోలో వెళ్లామని చెప్పినాకూడా ఆ అధికారి వినిపించుకోలేదని, ఆయనతీరుతో తన తండ్రి తీవ్ర మనోవేదనకు గురయ్యారని మధుమతి ఆరోపించింది. అయినా మెట్రోలో ప్రయాణించేందుకు దుబాయ్‌లో ఏదైనా డ్రస్‌ కోడ్‌ ఉందేమో...?!

  • Loading...

More Telugu News