: చిరంజీవి కంటే సమైక్యాంధ్రే ముఖ్యం: అభిమానుల మాట
కేంద్ర మంత్రి చిరంజీవిపై అభిమానులు భగ్గుమంటున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయన తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. చిరంజీవికంటే తమకు సమైక్యాంధ్రే ముఖ్యమని స్పష్టం చేశారు. రాజమండ్రిలో చిరు తనయుడు రామ్ చరణ్ 'ఎవడు' సినిమా ఫ్లెక్సీలను చించేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి రాజీనామా చేయకపోతే 'ఎవడు' చిత్రాన్ని తప్పక అడ్డుకుంటామని హెచ్చరించారు. అందుకు ఈనెల 21 వరకు గడువు విధించారు. ఈలోపే పదవిని వదిలేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలుపంచుకోవాలని సూచించారు.