: భారీ ఆధిక్యం దిశగా ఆస్ట్రేలియా


యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్ ను 527/7 వద్ద డిక్లేర్ చేసిన ఆసీస్ ఆ తర్వాత ఇంగ్లండ్ ను 368 పరుగులకే పరిమితం చేసింది. పీటర్సన్ (113) సెంచరీతో ఫాలో ఆన్ ప్రమాదం తప్పించుకున్న ఇంగ్లండ్.. ఆసీస్ కు 159 పరుగుల ఆధిక్యాన్ని సమర్పించుకుంది. ఇక నేడు నాలుగో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కంగారూలు 2 వికెట్లకు 86 పరుగులు చేశారు. దీంతో, వారి ఆధిక్యం 245 పరుగులకు చేరింది. చేతిలో వికెట్లున్నాయి. ఆటకు రేపు చివరిరోజు కాగా, నేటి చివరి సెషన్ లో ధాటిగా ఆడి, ఇంగ్లండ్ ను బ్యాటింగ్ కు దింపాలని ఆసీస్ వ్యూహకర్తలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News