: కడప జిల్లా దిగ్బంధానికి టీడీపీ పిలుపు
సమక్యాంధ్రకు మద్దతుగా రేపు కడప జిల్లా దిగ్బంధానికి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి 48 గంటలపాటు ఈ దిగ్బంధం ఉంటుందని టీడీపీ జిల్లా నేత పుట్టా నరసింహారెడ్డి తెలిపారు. కడప జిల్లా సరిహద్దులన్నీ దిగ్బంధించి కేవలం అంబులెన్సులు, ఇతర వైద్య సర్వీసు వాహనాలను మాత్రమే అనుమతిస్తామని ఆయన చెప్పారు.