: ఆపిల్ ఫోన్ల కోసం వెళితే, ఆపిల్ పండ్లతో బురిడీ


ఆన్ లైన్ లావాదేవీలతో ఎంత సౌలభ్యం ఉంటుందో, అంత ప్రమాదమూ పొంచి ఉంటుంది. ఏమరుపాటుగా వ్యవహరిస్తే, జేబుకు చిల్లు పడడం ఖాయం. ఆస్ట్రేలియాలో ఓ మహిళకు ఈ విషయం చక్కగా అర్ధమై ఉంటుంది. వివరాల్లోకెళితే.. మెల్ బోర్న్ కు చెందిన బాధిత మహిళ తనకు రెండు సెకండ్ హ్యాండ్ ఆపిల్ స్మార్ట్ ఫోన్లు కావాలని ఇంటర్నెట్లో యాడ్ ఇచ్చింది. దానికి స్పందించిన మరో మహిళ తన వద్ద రెండు 'ఆపిల్స్' ఉన్నాయని, కావాలంటే మెక్ డోనాల్డ్స్ రెస్టారెంటు వద్దకు రావాలని సూచించింది. అక్కడ ఆమె వద్ద నుంచి రూ.73 వేలు తీసుకున్న ఆ కిలాడీ, 'ఆపిల్స్' ఇందులో ఉన్నాయంటూ ఓ సీల్డ్ ప్యాక్ ను చేతిలో పెట్టింది.

బాధిత మహిళ అక్కడే ఆ ప్యాకెట్ ను తెరిచి చూస్తే గుట్టురట్టయ్యేది. కానీ, ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత చూద్దాంలే అనుకోవడమే ఆమె సొమ్ముకు రెక్కలొచ్చేట్టు చేసింది. ఇంటికొచ్చి హడావుడిగా ప్యాక్ విప్పి చూస్తే, స్మార్ట్ ఫోన్లకు బదులు నిగనిగలాడుతూ రెండు తాజా యాపిల్ పండ్లు ఆమెను చూసి వెక్కిరించాయి. మోసపోయాననుకుని లబోదిబోమన్న ఆ ఆసీస్ వనిత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • Loading...

More Telugu News