: ఇక పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు
పోస్టాఫీస్ విధులను సరికొత్తగా నిర్వచించేందుకు కేంద్రం సమాయత్తమైంది. పోస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట ఇకపై తపాలా కార్యాలయాల్లోనూ బ్యాంకింగ్ సేవలు అందించాలని కేంద్రం తలపోస్తోంది. ఈ దిశగా కసరత్తులు మొదలుపెట్టింది. ఇప్పటికే బ్యాంకింగ్ సేవల లైసెన్సుకోసం తపాలా శాఖ దరఖాస్తు చేసుకోగా, అనుమతి లభిస్తే, తొలుత 50 శాఖల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందిస్తారు. మరో ఐదేళ్ళలో దాన్ని 150 శాఖలకు విస్తరిస్తారు. ఇందుకోసం కేంద్రం రూ.1300 కోట్లు కేటాయించనుంది. ఈ నెలలో సమావేశమయ్యే ఫైనాన్స్ కమిషన్ పోస్ట్ బ్యాంకులపై తుది నిర్ణయాన్ని వెలువరించనుంది.