: కేసీఆర్ లో దొర పోకడ ఇంకా పోలేదు: రేవూరి
సీమాంధ్ర ఉద్యోగులపై వ్యాఖ్యానించి, ఆనక, వివరణ ఇచ్చుకున్న కేసీఆర్ పై టీడీపీ తెలంగాణ ప్రాంత నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ మాటలు చూస్తుంటే ఆయనలో ఇంకా దొర పోకడలు పోలేదని తెలుస్తోందని అన్నారు. పునర్నిర్మాణం గురించి మాట్లాడుతున్న కేసీఆర్.. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం చేసిందేమీలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదని విమర్శించారు. అయితే, మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టుకు అనుమతి, బీడీ కట్టలపై పుర్రె గుర్తు కేసీఆర్ హయాంలోనే వచ్చి తెలంగాణ వాసుల పొట్టగొట్టాయని రేవూరి గుర్తు చేశారు.