: రాజీనామా చేసేందుకు సీఎం రెడీ?


తెలంగాణ ప్రకటన తదనంతర పరిణామాల నేపథ్యంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డట్టు తెలుస్తోంది. ఓవైపు సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రాంతం అట్టుడికిపోతుండగా, తాను పదవిలో కొనసాగడంలో ఔచిత్యం కనిపించడంలేదని ఆయన మంత్రులతో భేటీలో వ్యాఖ్యానించినట్టు రాజకీయ వర్గాలంటున్నాయి. మరోవైపు, రాష్ట్రంలో విద్వేషాలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో సీఎంను మార్చడం ద్వారా పరిస్థితిని కొంతవరకు చక్కదిద్దవచ్చని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. వీటన్నింటిని బేరీజు వేసుకున్న సీఎం తాను తప్పుకుంటేనే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కాగా, నిన్న సీఎంతో సమావేశమైన సీమాంధ్ర ప్రజాప్రతినిధుల్లో పెక్కుమంది, కిరణ్ రాజీనామా చేస్తే అధిష్ఠానంపై ఒత్తిడి పెరుగుతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News