: కేంద్ర హోం మంత్రి షిండేకు శస్త్ర చికిత్స
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే గతరాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం తన తండ్రి పరిస్థితి బాగానే ఉందని షిండే కుమార్తె, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రణతి మీడియాకు తెలిపారు. ఇది చిన్న సర్జరీయేనని, రెండు రోజుల విశ్రాంతి సరిపోతుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. 5 నుంచి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు షిండే హాజరవుతారని స్పష్టం చేశాయి.