: ఆరోరోజుకు చేరిన ఏయూ విద్యార్థుల ఆమరణ దీక్ష


సమైక్యాంధ్ర కోసం విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన ఆమరణ దీక్ష నేడు ఆరోరోజుకు చేరుకుంది. వర్శిటీకి చెందిన పలువురు విద్యార్థి నేతలు ఈ దీక్షలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి నిన్న ఏయూకి విచ్చేసి దీక్ష చేపట్టిన విద్యార్థులను పరామర్శించి వారికి తన మద్దతు తెలిపారు. కాగా, ఈ ఉదయం కూడా విశాఖలో పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పాతగాజువాకలో జాతీయ రహదారిపై కాంగ్రెస్ కార్యకర్తలు రాస్తారోకో జరిపారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్ళే ఆర్టీసీ బస్సు అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ముగ్గురు ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News