: పదేళ్ల తర్వాత హైదరాబాద్ తెలంగాణకే సొంతం: దిగ్విజయ్


రాష్ట్రాన్ని విభజిస్తే భవిష్యత్తులో హైదరాబాద్ ఎవరిది అన్న దానిపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. సీఎన్ఎన్ ఐబీఎన్ చానల్ డెవిల్స్ అడ్వకేట్ కార్యక్రమంలో కరణ్ థాపర్ అడిగిన పలు ప్రశ్నలకు దిగ్విజయ్ బదులిచ్చారు. రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని.. పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంచాలంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. కరణ్ థాపర్ ప్రశ్నలు.. వాటికి దిగ్విజయ్ సమాధానాలు ఇలా ఉన్నాయి.

కరణ్ థాపర్: పదేళ్ల తర్వాత అంటే ఉమ్మడి రాజధాని కాలం ముగిసిన తర్వాత హైదరాబాద్ పూర్తిగా తెలంగాణ సొంతమేనా? లేక మరో చండీగఢ్ అవుతుందా?

దిగ్విజయ్: హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికేనని తీర్మానంలో హామీ ఇచ్చాం.

కరణ్ థాపర్: 1960లలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఏర్పాటు సమయంలో చండీగఢ్ పంజాబ్ కే నంటూ హామీ ఇచ్చారు కదా? మరిప్పుడు అది రెండు రాష్ట్రాలకు శాశ్వతంగా ఇచ్చేశారు కదా?

దిగ్విజయ్: మేము తీర్మానంలో స్పష్టంగా పేర్కొన్నాం. సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు విషయంలో అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తాం. కరణ్ థాపర్: పదేళ్ల ఉమ్మడి రాజధాని సమయంలో హైదరాబాద్ తెలంగాణలో భాగమా.. లేక కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందా?

దిగ్విజయ్: తెలంగాణలో భాగం

కరణ్ థాపర్: ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ హైదరాబాద్ తెలంగాణలో భాగంగా ఉంటుందా?

దిగ్విజయ్: అవును

  • Loading...

More Telugu News