: కేసీఆర్... రెచ్చగొట్టకు: పొన్నం ప్రభాకర్
రాష్ట్ర ఏర్పాటుకు శాంతియుత వాతావరణం కల్పించాలని కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను కోరారు. రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు తెలంగాణను విడిచి వెళ్లాలని, వారికి ఆప్షన్లు ఉండవంటూ కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే, ఉద్యమం పేరుతో నేతల విగ్రహాలు ధ్వంసం చేయడం మానుకోవాలని పొన్నం ప్రభాకర్ సీమాంధ్ర ఉద్యమకారులకు సూచించారు. విగ్రహాల ధ్వంసానికి బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.