: వేడి పెరిగితే బుద్ధులు తీవ్రమౌతాయిట
వాతావరణంలో వేడిమి, ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ.. ప్రజల ఆవేశకావేషాలు కూడా పెరుగుతూ ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హింసాత్మకమైన నేరాలకు పాల్పడడం, యుద్ధాలకు కాలుదువ్వడం వంటి చర్యలు.. అలాంటి ఆలోచనలు... వాతావరణంలో వేడితో పాటూ పెరుగుతాయిట. అమెరికాలో జరిగిన పరిశోధనలు, అధ్యయనాలు ఇలాంటి ఫలితాలను తేలుస్తున్నాయి.
చరిత్రలో సామ్రాజ్యాలు కూలిపోవడం, ఇటీవలి యుద్ధాలు, హింసాత్మక నేరాలు వంటి 60 ఘటనలను పరిశోధకులు గుర్తించారు. అమెరికాలో కాల్పులు జరపాలని పోలీసులు నిర్ణయాలు తీసుకునే ఘటనలను కూడా వారు పరిశీలించారు. శతాబ్దాలుగా ఒక ఏకసూత్రతను వారు గుర్తించారు. అదేంటంటే.. అత్యంత వేడిమిగల పరిస్థితులు ఉండడం మరింత హింసకు దారితీస్తోంది. వాతావరణం మారిపోయినప్పుడు, మనలో ఇతరుల్ని బాధించాలనే తత్వం కూడా పెరుగుతుంది అని బెర్కిలీ లోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ఎకనామిస్టు సాల్మన్ సియాంగ్ చెబుతున్నారు.