: డేటింగ్ రూమర్లు ఇబ్బంది పెట్టవు: ఆలియా భట్


బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ఆలియాభట్ ఒక్క సినిమాకే చిత్ర పరిశ్రమలో ఉన్న వ్యవహారాల్ని నేర్పుగా ఒంటబట్టించేసుకుంది. తొలి సినిమాలో సహనటుడు వరుణ్ ధావన్ తో ఈ చిన్నది డేటింగ్ లో బిజీగా ఉందని పుకార్లు షికారు చేశాయి. ఆ సినిమా తరువాత బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్ తో ఘాటు ప్రేమలో మునిగి తేలిపోతోందని బాలీవుడ్ కోడైకూస్తోంది. దీనిపై స్పందించిన ఈ ఇరవయ్యేళ్ల చిన్నది పుకార్లు తనను ఏమాత్రం ఇబ్బంది పెట్టవని తెలిపింది. తాను సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచీ వీటికి అలవాటు పడిపోయానని, పుకార్లు చూసినప్పుడల్లా నవ్వుకుంటానని తెలిపింది.

ఢిల్లీలో ఓ ప్రైవేటు ప్రోగ్రాంలో పాల్గొన్న ఆమె వరుణ్ తనకు పరిచయం కాకముందే, తమ మధ్య ఘాటు ప్రేమ నడుస్తోందని పుకార్లు పుట్టించారని, అప్పట్నుంచి మీడియా ఏం చెప్పినా అందులో నిజం ఉండదన్న విషయం అర్ధమైందని తెలిపింది. అందుకే, తాను అలాంటి అర్ధం లేని మాటలను పట్టించుకోనని కొట్టి పారేసింది. తాను ఎవరినైనా ప్రేమిస్తే దాచుకోనని, అందరికీ తెలిసేలా ప్రేమిస్తానని ముక్తాయింపునిచ్చింది.

  • Loading...

More Telugu News