: భారత్ క్లీన్ స్వీప్


జింబాబ్వేతో వన్డే సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. చివరి వన్డేలో 7 వికెట్లతో ఘనవిజయం సాధించిన భారత్.. ఐదు వన్డేల సిరీస్ ను 5-0తో చేజిక్కించుకుంది. నేడు బులవాయోలో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే.. భారత్ కు 164 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. ఓపెనర్ పుజారా (0) తొలి ఓవర్లోనే అవుటైనా.. ధావన్ (41), రహానే (50), జడేజా (48 నాటౌట్) జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు. భారత్ ఈ లక్ష్యాన్ని 34 ఓవర్లలోనే అధిగమించడం విశేషం కాగా, ఆరు వికెట్లు తీసి జింబాబ్వేను హడలెత్తించిన లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

  • Loading...

More Telugu News