: ఉద్యోగులను వెళ్లిపొమ్మనడానికి కేసీఆర్ ఎవరు?: రాజనర్సింహ
ఉద్యోగులను వెళ్లిపొమ్మనడానికి కేసీఆర్ ఎవరని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగులను వెళ్లిపోవాలని ఆదేశించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికీ రాజ్యాంగ రక్షణ ఉంటుందని, ఎవరూ అభద్రతా భావానికి గురి కావొద్దని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా ఉద్యోగం, వ్యాపారం, నివాసం ఏర్పరచుకునే అధికారాన్ని రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనంపై కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు.