: తెలంగాణకు ఆ పేరెలా వచ్చిందంటే...


తెలంగాణ పేరు వెనకున్న కథాకమామీషూ ఇదిగోనంటున్నారు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. తెలంగాణ పేరెలా వచ్చిందో తెలియకుండానే, భారీ ఉద్యమాలు చేస్తున్నారని, జై తెలంగాణ అంటున్నారని చెప్పుకొచ్చారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణకు ఆ పేరెలా వచ్చిందో వివరించారు. 700 ఏళ్ళ క్రితం మొఘల్ సైనికులు కాకతీయ సామ్రాజ్యంపై దాడి చేసి యుగంధర్ అనే సైన్యాధ్యక్షుణ్ణి బందీగా పట్టుకెళ్ళారని చెప్పారు. అతడిని ఢిల్లీ తీసుకెళ్ళగా.. మతం మార్చుకునేందుకు అంగీకరించి, తన పేరును ఖాన్-ఏ-జహా మక్బూల్ తెలంగాణీగా మార్చుకుని, తిరిగి ఓరుగల్లు ప్రాంతానికి వచ్చాడని పేర్కొన్నారు. అక్కడి నుంచే అతడు మొఘలుల ప్రతినిధిగా పాలన సాగించాడని, అతని పేరుమీదే ఈ ప్రాంతానికి తెలంగాణ అని వచ్చిందని ఒవైసీ విపులీకరించారు.

ఆయన సమాధి ఇప్పటికీ ఢిల్లీలోని నిజాముద్దీన్ ఔలియా దర్గా ప్రాంతంలో ఉందని తెలిపారు. అయితే, అది శిథిలావస్థకు చేరుకుందని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇక, తెలంగాణకు ఆ పేరు రావడానికి కారణమైన వీరుడిని ఎవరూ స్మరించుకోకపోవడం, కనీసం చరిత్ర తెలుసుకోకుండానే ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ పోరాడడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.

  • Loading...

More Telugu News