: 'ఆరే'సిన అమిత్ మిశ్రా
బలహీన జింబాబ్వే బ్యాట్స్ మెన్ టీమిండియా స్పిన్ వ్యూహంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరయ్యారు. లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా (6/48) ఆరు వికెట్లతో ఆతిథ్య జట్టు పనిబట్టాడు. బులవాయోలో జరుగుతున్న చివరి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే జట్టు మిశ్రా సూపర్ స్పెల్ తో కుదేలైంది. దీంతో, ఓవర్లన్నీ పూర్తిగా ఆడకుండానే 39.5 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. సీన్ విలియమ్స్ 51, మసకద్జ 32 పరుగులు చేశారు. ఇక, ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ పుజారా పరుగులేమీ చేయకుండానే జార్విస్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.