: కేంద్ర మంత్రి కోట్ల రాజీనామాకు పట్టు
కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాజీనామాకు కర్నూలు న్యాయవాదుల జేఏసీ పట్టుపట్టింది. కర్నూలు జిల్లా కేంద్రంలో న్యాయవాదుల జేఏసీ ప్రతినిధులు కోట్ల కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. మరోవైపు పత్తికొండలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. డోన్ జాతీయ రహదారిపై సమైక్యవాదులు బైఠాయించారు. దీంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.