: కాశ్మీర్ సీఎం వినతిని లక్ష్యపెట్టని బీసీసీఐ
జింబాబ్వేతో వన్డే సిరీస్ లో యువ ఆఫ్ స్పిన్నర్ పర్వేజ్ రసూల్ కు చోటు కల్పించాలంటూ జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన వినతిని బీసీసీఐ లక్ష్యపెట్టినట్టులేదు. ఐదు వన్డేల సిరీస్ లో తొలి నాలుగు వన్డేలకు ప్రకటించిన జట్టులో రసూల్ కు చోటు కల్పించని టీమిండియా మేనేజ్ మెంట్, నేటి చివరి వన్డేలోనూ మొండిచేయి చూపింది. ఒమర్ అబ్దుల్లా నిన్న ట్విట్టర్లో వ్యాఖ్యానిస్తూ.. 'రసూల్ ను జింబాబ్వే తీసుకెళ్ళింది, ఇలా అవమానించడానికేనా? అదే భారత్ లో ఇలా చేసి ఉంటే ఇంతకన్నా దారుణం మరోటి ఉండదు. రహానే స్థానంలో రాయుడికి అవకాశమిచ్చారు, రాయుడి స్థానంలో మరొకరు వచ్చారు. కానీ, రసూల్ మాటేంటి? కాశ్మీర్ లోయనుంచి జాతీయ జట్టుకు ఎంపికైన మొదటి ఆటగాడు రసూల్ కు అంతర్జాతీయ కెరీర్ ఆరంభించేందుకు ఇంకెంతకాలం వేచి చూడాలి? బీసీసీఐ..ఇకనైనా రసూల్ కు అవకాశమివ్వాలి' అని ఆక్రోశించారు.