: బొత్స సోదరుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సోదరుడు, విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా తన పదవికి రాజీనామా చేస్తున్నానని అన్నారు. రాష్ట్ర విభజన వెనకబాటుతనానికి పరిష్కారం కాదని ఆయన అన్నారు.