: రైలుకు అడ్డుపడిన సమైక్యవాదులు
సమైక్యాంధ్రకు మద్దతుగా విజయనగరం జడ్పీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రైల్ రోకో నిర్వహించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి రైల్వేస్టేషన్ లో చెన్నై-భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ ను అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించవద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.