: అమెరికాలో హిందువులపై దాడులు ఇక తీవ్ర నేరాలే


అమెరికాలో సిక్కులపై, హిందువులపై వరుసగా జరుగుతున్న దాడులతో అక్కడి ఒబామా సర్కారు మేల్కొంది. వీటికి చెక్ పెట్టేందుకు ఇకపై హిందువులు, సిక్కులు సహా మైనారిటీ మతాలపై దాడులను తీవ్రమైన నేరాలుగా పరిగణించి చట్ట ప్రకారం చర్యలు చేపడతారు. ఇందుకు వీలుగా చట్టాలను కఠినతరం చేయనున్నట్లు అమెరికా అటార్నీ జనరల్ ఎరిక్ హోల్డర్ వెల్లడించారు. దేశంలో అన్ని మతాల వారికి రక్షణ కల్పించేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఎరిక్ చెప్పారు.

  • Loading...

More Telugu News