: కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్సే అవకాశం ఇచ్చింది: వైఎస్సార్సీపీ


స్పష్టత లేకుండా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితులకు కారణమైందని వైఎస్సార్సీపీ మండిపడింది. తెలంగాణ ఏర్పడగానే ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోవాలన్న కేసీఆర్ వ్యాఖ్యలకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ కాదా? అని ఆ పార్టీ నేత శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. హైదరాబాదుపై ఒక స్పష్టమైన ప్రకటన చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఎంతోమంది నగరంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చేశారని, ఎన్నోవందల, వేల సంస్థలు ఇక్కడ స్థాపించారన్నారు. హైదరాబాదు ప్రగతిలో అందరికీ భాగం ఉందని చెప్పారు. కానీ, కాంగ్రెస్ ఒక్క ప్రకటనతో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుంటే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదని శోభానాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News