: అప్పుడు శ్రీకృష్ణ కమిటీ.. ఇప్పుడు ఆంటోనీ కమిటీయా?: అనంత


రాష్ట్ర విభజనపై గతంలో వేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను బుట్టదాఖలు చేసిన కేంద్రం తాజాగా ఆంటోనీ కమిటీని వేయడంలో ఔచిత్యం ఏమిటని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. ఆంటోనీ కమిటీ వల్ల ఏమీ ఒరగదని వ్యాఖ్యానించారు. అనంతపురంలో ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాదును తెలంగాణ రాజధానిగా ప్రకటించిన కేంద్రం.. సీమాంధ్ర పట్ల వ్యతిరేక వైఖరి అవలంబిస్తోందని అన్నారు. సీమాంధ్రకు రాజధానిని ఇప్పటివరకు ప్రకటించకపోవడం ఆ విషయాన్ని నిరూపిస్తోందన్నారు. రాష్ట్ర విభజనపై ముందుగా చెప్పకపోవడంవల్లే సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం మళ్ళీ రాజుకుందని అనంత అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News